Share News

టీవీఎస్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో

ABN , Publish Date - May 21 , 2025 | 02:58 AM

టీవీఎస్‌ మోటార్‌.. కొత్త ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. టీవీఎస్‌ కింగ్‌ ఈవీ మ్యాక్స్‌ పేరుతో దీన్ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.95 లక్షలు...

టీవీఎస్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌.. కొత్త ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. టీవీఎస్‌ కింగ్‌ ఈవీ మ్యాక్స్‌ పేరుతో దీన్ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 51.2 వాట్స్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో కూడిన ఈ ఆటో ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కేవలం 2.15 గంటల్లోనే 80 శాతం బ్యాటరీ చార్జింగ్‌ కావటం దీని ప్రత్యేకత అని టీవీఎస్‌ తెలిపింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈ ఆటో ప్రయాణిస్తుంది. ‘టీవీఎస్‌ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్‌’ ఫీచర్లను ఈ ఆటోకు జోడించినట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:58 AM