థర్మల్ ప్లాంట్లకు ఊరట
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:38 AM
బొగ్గు ఆఽధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ స్వల్ప ఊరట ఇచ్చిం ది. ఈ ప్లాంట్ల నుంచి వెలువడే వాయువుల్లో గంధకం (సల్ఫర్) శాతాన్ని...
న్యూఢిల్లీ: బొగ్గు ఆఽధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ స్వల్ప ఊరట ఇచ్చిం ది. ఈ ప్లాంట్ల నుంచి వెలువడే వాయువుల్లో గంధకం (సల్ఫర్) శాతాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) యంత్ర పరికరాల ఏర్పాటు నుంచి కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మినహాయింపు ఇచ్చింది. పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలకు 10 కిలోమీటర్ల పరిధిలోని థర్మల్ ప్లాంట్లకు మాత్ర మే ఈ నిబంధనను పరిమితం చేసింది. దీని వల్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు 25 పైసల నుంచి 30 పైసల వరకు తగ్గుతాయని తెలిపింది. దీనికి సంబంధించి ఆదివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే