Tesla India Charging Stations: కస్టమర్ల ముంగిట్లోనే చార్జింగ్ స్టేషన్లు
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:00 AM
ఖాతాదారుల జీవన శైలికి చేరువలోనే చార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ఈవీ కార్ల దిగ్గజం టెస్లా ఇండియా జీఎం శరద్ అగర్వాల్ వెల్లడించారు. ఈవీ వాహనదారులు టిఫిన్లు...
టెస్లా ఇండియా జీఎం
న్యూఢిల్లీ: ఖాతాదారుల జీవన శైలికి చేరువలోనే చార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ఈవీ కార్ల దిగ్గజం టెస్లా ఇండియా జీఎం శరద్ అగర్వాల్ వెల్లడించారు. ఈవీ వాహనదారులు టిఫిన్లు, భోజనాలు చేసే ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, విశ్రాంతి తీసుకునే ప్రాంతాల్లో సూపర్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్టీ, ముంబై నగరాల్లో ఇప్పటికే ఈ పని ప్రారంభించినట్టు తెలిపారు. మిగతా నగరాల విషయంలోనూ తమ వైఖరి ఇలానే ఉంటుందన్నారు. అవసరమైతే ఖాతాదారుల ఇంటి వద్ద కూడా చార్జింగ్ సేవలు అందిస్తామన్నారు.