Share News

ఎన్‌విడియాతో టెక్‌ మహీంద్రా భాగస్వామ్యం

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:40 AM

కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న చిప్‌ తయారీ సంస్థ ఎన్‌విడియాతో టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ వ్యక్తిగత భాగస్వామ్య ఒప్పందాలు...

ఎన్‌విడియాతో టెక్‌ మహీంద్రా భాగస్వామ్యం

న్యూఢిల్లీ: కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న చిప్‌ తయారీ సంస్థ ఎన్‌విడియాతో టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ వ్యక్తిగత భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం కింద ఆయా సంస్థలు వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందిస్తాయి. ఇందులో భాగంగా ఎన్‌విడియాకు చెందిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో పనిచేసే ఫార్మకోవిజిలెన్స్‌ (పీవీ) సొల్యూషన్‌ను టెక్‌ మహీంద్రా ఆవిష్కరించింది. ఇది ఔషధ భద్రతా నిర్వహణను మెరుగుపరుస్తుంది.

Updated Date - Mar 20 , 2025 | 03:40 AM