Share News

TCS Reported a Consolidated Net Profit: టీసీఎస్‌ లాభం రూ.12,075 కోట్లు

ABN , Publish Date - Oct 10 , 2025 | 02:40 AM

ఐటీ సర్వీసుల దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థి క సంవత్సరం రెండో త్రైమాసికం క్యూ2లో రూ.12,075 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది...

TCS Reported a Consolidated Net Profit: టీసీఎస్‌ లాభం రూ.12,075 కోట్లు

  • క్యూ2లో 1.4% అప్‌ జూ ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థి క సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో రూ.12,075 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.11,909 కోట్లతో పోల్చితే లాభం 1.4ు పెరిగింది. బీఎ్‌ఫఎ్‌సఐ సహా విభిన్న విభాగాల్లో ఏర్పడిన వృద్ధి లాభం పెరగడానికి దోహదపడిందని టీసీఎస్‌ వెల్లడించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 2.39ు వృద్ధితో రూ.64,259 కోట్ల నుంచి రూ.65,799 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోల్చితే మాత్రం ఆదాయం 3.7ు పెరిగినా లాభం 5.3ు క్షీణించింది. మొత్తం కాంట్రాక్టు విలువ లేదా టీసీవీ (కాంట్రాక్టు కాలపరిమితిలో సంబంధిత కస్టమర్‌ నుంచి ఆశిస్తున్న ఆదాయం) రెండో త్రైమాసికంలో వెయ్యి కోట్ల డాలర్లున్నట్టు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ సెస్కారియా అన్నారు. ఈ త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ మంచి వృద్ధిని తాము నమోదు చేసినట్టు సమీర్‌ చెప్పారు.

మధ్యంతర డివిడెండ్‌: ఒక రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుపై 11 రూపాయల రెండవ మధ్యంతర డివిడెండును టీసీఎస్‌ ప్రకటించింది. నవంబరు 4వ తేదీన ఈ డివిడెండును చెల్లిస్తారు. డివిడెండు పొందేందుకు అక్టోబరు 15 రికార్డు తేదీగా నిర్ణయించారు. బీఎ్‌సఈలో గురువారం టీసీఎస్‌ షేరు 1.16ు లాభంతో రూ.3,061.95 వద్ద ముగిసింది.


డేటా సెంటర్ల కోసం ప్రత్యేక అనుబంధ సంస్థ

ఇన్‌ఫ్రా, టెక్నాలజీ ఆధారిత సేవలందించగల ఏఐ, స్వతంత్ర డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దేశంలో 1 గిగావాట్‌ సామర్థ్యం గల డేటా సెంటర్‌ కోసం ఒక ప్రత్యేక వ్యాపార విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అలాగే మార్కెటింగ్‌ క్లౌడ్‌, సీఆర్‌ఎం, డేటా క్లౌడ్‌, ఏజెంట్‌ ఫోర్స్‌, ఏఐ అడ్వైజరీ సర్వీసుల్లో స్పెషలైజేషన్‌ గల అమెరికాకు చెందిన లిస్ట్‌ఎంగేజ్‌ కంపెనీని 7.28 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్టు తెలియ చేసింది.

3 నెలల్లో 20,000 మంది ఔట్‌

మారుతున్న వ్యాపార ముఖచిత్రానికి దీటుగా కంపెనీ పునర్నిర్మాణం పేరిట టీసీఎస్‌ ఒక్క త్రైమాసికంలోనే (జూలై-సెప్టెంబరు) సుమారు 20 వేల మందికి ఉద్వాసన చెప్పినట్టు కంపెనీ వెబ్‌సైట్‌లోని గణాంకాలు తెలుపుతున్నాయి. జూన్‌ త్రైమాసికం చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 6,13,069 ఉండగా సెప్టెంబరు చివరి నాటికి 5,93,314 ఉన్నట్లు అందులో ఉంది. అంటే నికరంగా తొలగించిన ఉద్యోగులు 19,755 అయితే .కంపెనీ మా త్రం ఆ సంఖ్యను తగ్గించి చూపుతోందని ఐటీ ఉద్యోగుల యూనియన్‌ నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌ సెనేట్‌ (నైట్స్‌) ఆరోపించింది. అయితే గురువారం ఆర్థిక ఫలితాల సందర్భంగా కంపెనీ సీహెచ్‌ఆర్‌ఓ సుదీప్‌ కున్నుమల్‌ మాత్రం తాము తొలగించింది 6,000 మంది మాత్రమేనని చెప్పారు. అయితే బీఎ్‌సఈకి పంపిన సమాచారంలో మాత్రం కంపెనీ ప్రకటించిన సంఖ్యలో త్రైమాసికం చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్యను, ఉద్యోగుల వలసల సంఖ్యను మినహాయించారని నైట్స్‌ ఆరోపిస్తోంది. అయితే కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రం పైన పేర్కొన్న గణాంకాలున్నాయని తెలిపింది. టీసీఎస్‌ వంటి సంస్థ చూపిన గణాంకాల్లోని ఈ వ్యత్యాసం ఏదో పొరపాటు చర్యగా భావించలేమని... రెగ్యులేటర్లు, విధానకర్తలు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ఉద్దేశపూర్వక చర్య అని నైట్స్‌ వాదిస్తోంది.

Updated Date - Oct 10 , 2025 | 02:40 AM