TCS CFO: జీతాల పెంపుపై టీసీఎస్‌లో అనిశ్చితి
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:01 AM
జీతాల పెంపుపై ఐటీ దిగ్గజం టీసీఎస్ నోరు మెదపడం లేదు. జీతాల పెంపు ముఖ్యమైన విషయమే అయినా, లాభాలతో కూడిన అభివృద్ధి అంతకంటే ముఖ్యమని కంపెనీ సీఎఫ్‌ఓ సమీర్ సెక్సారియా తేల్చి చెప్పారు...
లాభదాయకతే ముఖ్యమన్న సీఎ్‌ఫఓ
ముంబై: జీతాల పెంపుపై ఐటీ దిగ్గజం టీసీఎస్ నోరు మెదపడం లేదు. జీతాల పెంపు ముఖ్యమైన విషయమే అయినా, లాభాలతో కూడిన అభివృద్ధి అంతకంటే ముఖ్యమని కంపెనీ సీఎఫ్‌ఓ సమీర్ సెక్సారియా తేల్చి చెప్పారు. దీంతో టీసీఎ్‌సలో జీతాల పెంపు ఎప్పుడు జరుగుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సాధారణంగా టీసీఎ్‌సతో సహా ప్రధాన ఐటీ కంపెనీలు ఏటా ఏప్రిల్ నుంచి జీతాల పెంపు అమలు చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ఏ ప్రధాన ఐటీ కంపెనీ కూడా జీతాల పెంపు గురించి ప్రకటించలేదు.
ఎందుకంటే ?
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇతర కారణాలతో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేవలం ఆరు శాతం పెరిగింది. మార్చి త్రైమాసికం సైతం కంపెనీకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన వార్షిక జీతాల పెంపు పక్కన పడింది. ‘టీసీఎ్‌సలో జీతాలు పెంపు అరుదుగా మాత్రమే వాయిదా పడుతుంది, తిరిగి జీతాల పెంపునకు వెళ్లడమే నా ప్రాధాన్యత’ అని సీఎ్‌ఫఓ చెప్పడం విశేషం. దీంతో టీసీఎ్‌సలో జీతాల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
లాభాలకూ గండి: ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలకు తోడు, ట్రంప్ సుంకాల పోటు పరిశ్రమను భయపెడుతోంది. ప్రధాన మార్కెట్లయిన అమెరికా, ఐరోపా నుంచి కొత్త ప్రాజెక్టులు పెద్దగా రావడం లేదు. వచ్చినా అరకొర ప్రాజెక్టులే. దీనికి తోడు చాలినంత ఏఐ నైపుణ్యాలున్న నిపుణులు దొరక్క, అనేక కంపెనీలు ఉన్న ప్రాజెక్టులనే సక్రమంగా పూర్తి చేయలేకపోతున్నాయి. టీసీఎ్‌సని కూడా ఇవే సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో జూన్ త్రైమాసికంలో 24.5 శాతానికి పడిపోయిన స్థూల లాభాన్ని మళ్లీ 26 నుంచి 28 శాతానికి పెంచడమే తమ ముందున్న ప్రాధాన్యత అని సెక్సారియా స్పష్టం చేశారు.
డిమాండ్‌ను బట్టే నియామకాలు
డిమాండ్ పెరిగితే తప్ప నియామకాలు పెంచే యోచన లేదని కూడా టీసీఎస్ సీఎ్‌ఫఓ స్పష్టం చేశా రు. లేకపోతే కంపెనీ లాభాలు మరింతగా తగ్గే ప్రమా దం ఉందన్నారు. కొత్త ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడంతో ఉన్న ఉద్యోగులనే సరిగా ఉపయోగించుకోలేక పోతున్నట్టు చెప్పారు. ఉద్యోగుల వినియోగం తమ చేతుల్లో ఉన్నా, డిమాండ్ మాత్రం తమ చేతుల్లో లేదన్నారు. ఉన్న ఉద్యోగులను సక్రమంగా వినియోగించుకోవడం, డిమాండ్ పుంజుకోవడం రెండూ తమకు ముఖ్యమేనని సెక్సారియా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే