Income Tax Refunds: 11 సంవత్సరాల్లో 474 శాతం పెరిగిన ఐటీ రిఫండ్లు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:36 AM
గతంతో పోల్చితే ఆదాయపు పన్ను రిఫండ్లలో వేగం పెరిగింది. గత 11 సంవత్సరాల కాలంలో ఐటీ రిఫండ్లు 474% పెరిగి 2024-25 సంవత్సరం నాటికి రూ.4.77 లక్షల కోట్లకు చేరాయి...
న్యూఢిల్లీ: గతంతో పోల్చితే ఆదాయపు పన్ను రిఫండ్లలో వేగం పెరిగింది. గత 11 సంవత్సరాల కాలంలో ఐటీ రిఫండ్లు 474% పెరిగి 2024-25 సంవత్సరం నాటికి రూ.4.77 లక్షల కోట్లకు చేరాయి. ఇదే కాలంలో పన్ను వసూళ్లలో ఏర్పడిన వృద్ధి 274 శాతంతో పోల్చితే రిఫండ్లలో వృద్ధి గణనీయంగా ఉంది. ఐటీ రిఫండ్ల కాల వ్యవధి 2013 సంవత్సరంలో 93 రోజులుండగా 2024 నాటికి 17 రోజులకు తగ్గింది. పన్ను యంత్రాంగంలో సమర్థత పెరగడంతో పాటు రిటర్న్‌ల ఫైలింగ్ నుంచి ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ వరకు డిజిటల్ మౌలిక వసతుల వినియోగం పెరగడం రిఫండ్లలో గణనీయమైన వృద్ధికి కారణమని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ముందుగానే నింపిన రిటర్న్‌లు అందుబాటులోకి తేవడం, రిఫండ్ ప్రాసెసింగ్‌లో ఆటోమేషన్, రియల్ టైమ్ టీడీఎస్ సద్దుబాట్లు ఈ మెరుగదలకు దోహదపడ్డాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే