టాటా మోటార్స్ లాభం 51 క్షీణత
ABN , Publish Date - May 14 , 2025 | 04:50 AM
టాటా మోటార్స్ లాభాలకు నాలుగో త్రైమాసికంలో లాభాలకు భారీగా గండి పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.8,556 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది...
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ లాభాలకు నాలుగో త్రైమాసికంలో లాభాలకు భారీగా గండి పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.8,556 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 51 శాతం తక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల ఆదాయం రూ.1,19,033 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.1,19,503 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నా వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.6 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..