తాజ్ జీవీకే లాభం రూ 28.6 కోట్లు
ABN , Publish Date - May 14 , 2025 | 04:42 AM
స్థానిక తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ నాలుగో త్రైమాసికానికి రూ.28.6 కోట్ల నికర లాభం నమోదు చేసింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : స్థానిక తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ నాలుగో త్రైమాసికానికి రూ.28.6 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.6 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.116.69 కోట్ల నుంచి రూ.130.59 కోట్లకు చేరింది. ఆదాయం, లాభాల పరంగా కంపెనీకి ఇది అత్యుత్తమ త్రైమాసికమని తాజ్ జీవీకే హోటల్స్ చైర్మన్ జీవీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..