Share News

Sunil Mittal Bharti Enterprises: కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌లోకి సునీల్‌ మిట్టల్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:37 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కొత్త రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టెలికాం, బీమా, రియల్టీ, ఆతిథ్య వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ హోల్డింగ్‌ కంపెనీ..

Sunil Mittal Bharti Enterprises: కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌లోకి సునీల్‌ మిట్టల్‌

  • భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, వార్‌బర్గ్‌ పింక్‌సకు హాయర్‌ ఇండియాలో 49 శాతం వాటా

  • డీల్‌ విలువ సుమారు రూ.7,500 కోట్లు!?

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కొత్త రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టెలికాం, బీమా, రియల్టీ, ఆతిథ్య వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ హోల్డింగ్‌ కంపెనీ.. వేగంగా వృద్ధి చెందుతున్న కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ విక్రయ మార్కెట్లోకి అడుగు పె ట్టింది. ఇందుకోసం చైనాకు చెందిన కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం హాయర్‌ గ్రూప్‌ భారత అనుబంధ విభాగమైన హాయర్‌ ఇండియాలో వ్యూహాత్మక వాటా కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింక్‌స, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కలిసి హైయర్‌ ఇండియాలో మొత్తం 49ు వాటాను దక్కించుకున్నాయి. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. హాయర్‌ ఇండియా మార్కెట్‌ విలువ రూ.15,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ లెక్కన, 49 శాతం వాటా కొనుగోలు కోసం సుమారు రూ.7,500 కోట్ల వరకు వెచ్చించి ఉండవచ్చు. ఈ లావాదేవీ పూర్తయ్యాక, హాయర్‌ ఇండియాలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, వార్‌బర్గ్‌ పిన్‌క్‌స సంయుక్తంగా 49ు వాటాను, చైనాకు చెందిన హాయర్‌ గ్రూప్‌ మరో 49ు వాటా కలిగి ఉండనున్నాయి. మిగతా 2 శాతం వాటా సంస్థ ఉద్యోగుల చేతుల్లో ఉంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్‌లో హాయర్‌ వృద్ధి, విస్తరణను మరింత వేగవంతం చేయనుందని.. కంపెనీ ఆవిష్కరణలు, భారతీ బలమైన నెట్‌వర్క్‌, బ్రాండ్ల వ్యాప్తిలో వార్‌బర్గ్‌ పింక్‌స ట్రాక్‌ రికార్డు ఇందుకు దోహదపడగలవని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ పే ర్కొంది. కాగా, తాజా పెట్టుబడులు మార్కెట్లో హాయర్‌ ఇండియా పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచగలవని హాయర్‌ గ్రూప్‌ అంటోంది.

2004లో భారత్‌లోకి ప్రవేశం

హాయర్‌ గ్రూప్‌ 2004లో భారత్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,500 విక్రయ కేంద్రాల తో కూడిన డీలర్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ సంస్థ టెలివిజన్లు, ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎల్‌ఈడీ ప్యానెళ్లు, వాటర్‌ హీటర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు తదితర ఉత్పత్తులను విక్రయిస్తోంది. గడిచి న ఏడేళ్లలో కంపెనీ వ్యాపారం సు మారు 25ు చొప్పున వృద్ధి చెందు తూ వచ్చింది.

Updated Date - Dec 25 , 2025 | 05:37 AM