Demand For Office Spaces: కార్యాలయ స్థలాలకు మంచి డిమాండు
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:15 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండు 35ు పెరిగింది.....
న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండు 35ు పెరిగింది. దేశ, విదేశీ కంపెనీలు 162.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాలను లీజుకి తీసుకున్నాయి. హైదరాబాద్‌లో లీజింగ్ 7 శాతం పెరిగి 13.2 లక్షల నుంచి 14.2 లక్షల చదరపు అడుగులకు చేరింది. అయితే బెంగళూరు, ముంబై నగరాల్లో మాత్రం నికర లీజింగ్ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్స్ తాజా నివేదికలో తెలిపింది.