Stonecraft Group: రూ 300 కోట్ల పెట్టుబడులు యాదగిరిగుట్ట వద్ద
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:09 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రియల్టీ సంస్థ స్టోన్‌క్రా్‌ఫ్ట గ్రూప్ మరో భారీ ప్రాజెక్టు చేపడుతోంది. యాదగిరిగుట్ట వద్ద 110 ఎకరాల్లో రూ.300 కోట్ల పెట్టుబడితో...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రియల్టీ సంస్థ స్టోన్‌క్రా్‌ఫ్ట గ్రూప్ మరో భారీ ప్రాజెక్టు చేపడుతోంది. యాదగిరిగుట్ట వద్ద 110 ఎకరాల్లో రూ.300 కోట్ల పెట్టుబడితో సమగ్ర టెంపుల్ టౌన్‌షి్‌ప ఏర్పాటు చేయనున్నట్టు స్టోన్‌క్రా్‌ఫ్ట గ్రూప్ ఎండీ కీర్తి చిలుకూరి చెప్పారు. ఈ టౌన్‌షి్‌పలో 90 ఎకరాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు, మిగతా 20 ఎకరాల్లో సీనియర్ సిటిజన్ల కోసం 333 ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ రెండు వెంచర్ల ద్వారా రూ.1,100 కోట్ల ఆదాయం లభిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.