Stock Market: 6 నెలలురూ.23 లక్షల కోట్లు
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:26 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ మూడడుగులు ముందుకు, ఆరడుగు లు వెనక్కి వేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్....
న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ మూడడుగులు ముందుకు, ఆరడుగు లు వెనక్కి వేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.23 లక్షల కోట్లు ఆవిరైపోయి రూ.451.6 లక్షల కోట్ల కు చేరింది. అయినా గత ఆరు నెలల్లో సెన్సెక్స్ 4.6ు, నిఫ్టీ 3.7ు లాభపడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం తర్వాత సూ చీలు ఇంత కనిష్ఠ లాభాలతో ట్రేడవడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో ఈ రెండు ప్రధాన సూచీలు దాదాపు రెండు శాతం వరకు నష్టపోయాయి. అయితే గత ఆరు నెలల్లో నిఫ్టీ మిడ్‌క్యాప్-100, నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 సూచీలు మాత్రం తొమ్మిది శాతం వరకు లాభాలు పంచాయి.
ఆదుకుంటున్న డీఐఐలు : అంతర్జాతీయ ఉద్రిక్తతలతో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత ఆరు నెలల్లో దాదాపు రూ.37,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. భారత్ కంటే చైనా మార్కెట్ చౌకగా ట్రేడవడం ఇందుకు దోహదం చేస్తోంది. ఎఫ్‌పీఐలు అమ్మకాలు చేస్తుంటే దేశీయ సంస్థలు (డీఐఐ) మాత్రం మార్కెట్‌ను ఆదుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో ఈ సంస్థలు దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్టు అంచనా. డీఐఐలు ఆదుకోకపోతే సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలకు లోనయ్యేవి.
సత్తా చాటిన రంగాలు: గత ఆరు నెలల్లో ఆటోమొబైల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ కంపెనీల షేర్ల మాత్రం మదుపరులకు మంచి లాభాలే పంచాయి. ఐటీ, సిమెంట్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు మాత్రం బేర్‌మంటున్నాయి. ఐటీ ఇండెక్స్ దాదాపు తొమ్మిది శాతం నష్టపోయింది.
ఎనిమిదో రోజూ నష్టాలే
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఎనిమిదో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 97.32 పాయింట్ల నష్టంతో 80,267.62 వద్ద, నిఫ్టీ 23.80 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ముగిశాయి. గత ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్ 2,746.34 పాయింట్లు నష్టపోయింది. ఎడతెగని ఎఫ్‌పీఐ అమ్మకాలు, బుధవారం వెలువడే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానం ఎలా ఉంటుందోననే ఆందోళన, గురువారం ముగిసే సెప్టెంబరు నెల డెరివేటివ్స్ సెటిల్‌మెంట్ మంగళవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రధాన సానుకూల అంశాలేవీ లేకపోవడమూ మార్కెట్‌కు కలిసి రాలేదు.