Share News

Stock Market Rally: నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:26 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బ్యాంకింగ్‌తో పాటు ఇతర షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 576.77 పాయింట్లు...

Stock Market Rally: నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌

  • సెన్సెక్స్‌ 452 పాయింట్లు పతనం

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బ్యాంకింగ్‌తో పాటు ఇతర షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 576.77 పాయింట్లు పతనమై 83,482.13 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. చివరికి 452.44 పాయింట్ల నష్టంతో 83,606.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 120.75 పాయిం ట్లు కోల్పోయి 25,517.05 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 18 నష్టాలు చవిచూడగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి. బీఎస్ఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం 0.81 శాతం వరకు పెరిగాయి. రంగాలవారీ సూచీల్లో రియల్టీ, బ్యాంకింగ్‌ అర శాతానికి పైగా నష్టపోయాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, సర్వీసెస్‌ సూచీలు మాత్రం ఒక శాతానికి పైగా పెరిగాయి.

సిగాచీ షేరు 11.50 శాతం డౌన్‌

తెలంగాణకు చెందిన ఫార్మా కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు పాశమైలారంలో ఉన్న ప్లాంటులో భారీ పేలుడు సంభవించడంతో కనీసం 12 మంది సిబ్బంది మరణించడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు, పలు పరికరాలు, మౌలిక వసతులు కూడా ధ్వంసమవడంతో ప్లాంట్‌ను 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిగాచీ షేరు ఒక దశలో 14.82 శాతం వరకు పతనమైంది. చివరికి 11.58 శాతం నష్టంతో రూ.48.79 వద్ద ముగిసింది.

Updated Date - Jul 01 , 2025 | 02:27 AM