Share News

Trumps Tariff Impact: సూచీలకు సుంకాల సెగ

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:51 AM

ట్రంప్‌ సుంకాల సెగతో భారత స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీగా నష్టపోయింది. ఆరంభ ట్రేడింగ్‌లో 787 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు జారిన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం నుంచి మళ్లీ కాస్త తేరుకుంది...

 Trumps Tariff Impact: సూచీలకు సుంకాల సెగ

ఆరంభంలో సెన్సెక్స్‌ 787 పాయింట్లు పతనం

296 పాయింట్ల నష్టంతో ముగింపు

ముంబై: ట్రంప్‌ సుంకాల సెగతో భారత స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీగా నష్టపోయింది. ఆరంభ ట్రేడింగ్‌లో 787 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు జారిన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం నుంచి మళ్లీ కాస్త తేరుకుంది. చివరికి సూచీ 296.28 పాయింట్ల నష్టంతో 81,185.58 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86.70 పాయింట్లు కోల్పోయి 24,768.35 వద్ద ముగిసింది. టెక్స్‌టైల్స్‌, ఆటో, ఫార్మా, ఐటీ రంగ షేర్లు అధిక అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా.. టాటా స్టీల్‌ అత్యధికంగా 2.20 శాతం క్షీణించింది. సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ షేర్లు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. ఆశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేరు 3.48 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కాగా, బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 0.85 శాతం వరకు నష్టపోయాయి.

Updated Date - Aug 01 , 2025 | 05:51 AM