Stock Markets: అప్రమత్తంగా వ్యవహరించండి..!
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:57 AM
దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం ఈ వారం అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా జీఎ్‌సటీ వసూళ్లు, కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి...
దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం ఈ వారం అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా జీఎ్‌సటీ వసూళ్లు, కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. యూఎస్ రిజర్వ్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటం, టారిఫ్స్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం. ప్రస్తుతం చమురు, రియల్టీ, ఇన్‌ఫ్రా, పీఎ్‌సయూ బ్యాంకుల షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
అరబిందో ఫార్మా: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు రివర్సల్ బాట పడుతోంది. క్రమంగా బలం పుంజుకుంటోంది. డెలివరీ వాల్యూమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,138 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,100 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,250/1,330 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,050 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
బీఈఎల్: జీవితకాల గరిష్ఠం తర్వాత 18 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు మళ్లీ సెప్టెంబరు నుంచి అదే స్థాయిలో రాబడి అందించింది. ఒడుదొడుకులు లేకపోవటం, రాబోయే రోజుల్లో రక్షణ రంగ డీల్స్ పెరిగే అవకాశం, మంచి ఆర్థిక ఫలితాలు ఈ కౌంటర్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. గత శుక్రవారం రూ.426 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.455/475 టార్గెట్ ధరతో రూ.415 పై స్థాయిలో పడుతున్నప్పుడు కొనుగోలు చేయాలి. రూ.404 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐనాక్స్ విండ్: జీవిత కాల గరిష్ఠం తర్వాత ఈ షేరు దాదాపు 50 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయి రూ.150 వద్ద మరోసారి అప్‌ట్రెండ్ బాట పట్టింది. బలమైన ఫండమెంటల్స్ ఉండటం మున్ముందు షేరు ధర పెరుగుదలను సూచిస్తోంది. గత శుక్రవారం రూ.155 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.150 ఎగువన ప్రవేశించి రూ.175/190 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.144 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గ్లెన్‌మార్క్: ఈ ఏడాది జూలై నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో ఉంది. దాదాపు 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. మళ్లీ ఆర్థిక ఫలితాల తేదీ సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,891 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,880 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.2,100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,820 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ కౌంటర్‌లో డబుల్ బేస్ ఏర్పడింది. పైగా పీఎ్‌సయూ బ్యాంకింగ్ రంగానికి మూమెంటమ్ ఉంది. రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.148 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.145/140 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.190/210 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.135 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.