Govt Savings Scheme: చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లు యథాతథం
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:16 AM
పీపీఎఫ్, ఎన్‌ఎ్‌ససీ సహా వివిధ చిన్న తరహా పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి యథాతథంగా కొనసాగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: పీపీఎఫ్, ఎన్‌ఎ్‌ససీ సహా వివిధ చిన్న తరహా పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి యథాతథంగా కొనసాగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను ఎలాంటి మార్పు లేకుం డా యథాతథంగా ఉంచడం వరుసగా ఇది ఆరోసారి. అంటే సెప్టెంబరు చివరి వరకు చిన్న మొత్తాల పొదుపుపై చెల్లించే వడ్డీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుంది.