Share News

Bharti Airtel: ఎయిర్‌టెల్‌లో 0.8 శాతం వాటాల విక్రయం

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:47 AM

భారతి ఎయిర్‌టెల్‌లో 0.8% వాటాలను రూ.10,353 కోట్ల కు విక్రయించినట్టు సింగపూర్‌కు చెందిన టెలికాం కంపెనీ సింగ్‌టెల్‌ ప్రకటించింది. ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణలో.

Bharti Airtel: ఎయిర్‌టెల్‌లో 0.8 శాతం వాటాల విక్రయం

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్‌లో 0.8% వాటాలను రూ.10,353 కోట్ల కు విక్రయించినట్టు సింగపూర్‌కు చెందిన టెలికాం కంపెనీ సింగ్‌టెల్‌ ప్రకటించింది. ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. ఈ విక్రయం అనంతరం ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ వాటా 27.5 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా అంచనా విలువ రూ.3.46 లక్షల కోట్లుగా ఉంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రైవేటుగా షేర్ల కేటా యింపు విధానంలో ఈ లావాదేవీ జరిగింది. ఎయిర్‌టెల్‌పై మార్కెట్లో విశ్వాసానికి, బలమైన డిమాండ్‌కు ఇది దర్పణ మని పేర్కొంది. ఈ లావాదేవీ ద్వారా వచ్చిన లాభం 110 కోట్ల సింగపూర్‌ డాలర్లుంటుందని సింగ్‌టెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 4.46% క్షీణించి రూ.2001.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.47% క్షీణించి రూ.2001.20 వద్ద క్లోజైంది.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 04:47 AM