Silver Prices Hit Record High: సరికొత్త రికార్డు గరిష్ఠానికి వెండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:20 AM
వెండి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.2,400 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి...
రూ.1.94 లక్షలు దాటిన కిలో ధర
న్యూఢిల్లీ: వెండి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.2,400 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,94,400కు చేరుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరో 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి వరుసగా మూడో రోజూ పెరిగి కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 63 డాలర్లకు చేరింది. సరఫరా కొరతతో పాటు రూపాయి క్షీణత దేశీయంగా వీటి ధరలను మరింత ఎగదోశాయి. కాగా, పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.90 పెరిగి రూ.1,32,490గా నమోదైంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..