Silver Price: వెండి కిలో రూ.1.92 లక్షలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:59 AM
బులియన్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.11,500 పెరిగి రూ.1.92 లక్షలకు చేరింది...
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 114ు అప్
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.11,500 పెరిగి రూ.1.92 లక్షలకు చేరింది. ఇది సరికొత్త రికార్డు. గత రెండు నెలల్లో కిలో వెండి ధర ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,02,300 (114.04ు) పెరిగి మదుపరులకు బంపర్ లాభాలు పంచింది. గత ఏడాది డిసెంబరు 31న ఢిల్లీలో కిలో వెండి ధర రూ.89,700 వద్ద ట్రేడైంది.