Shloka Srinivas: ఏఏఏఐ బోర్డులో శ్లోకా శ్రీనివాస్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:47 AM
అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్ల బోర్డులోకి శ్లోకా అడ్వర్‌టైజింగ్ అధినేత శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు.
హైదరాబాద్: అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్ల బోర్డులోకి శ్లోకా అడ్వర్‌టైజింగ్ అధినేత శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. భారతీయ అడ్వర్‌టైజింగ్ రంగంలో శ్రీనివా్‌సకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. శ్లోకా అడ్వర్‌టైజింగ్ స్థాపించిన నాటి నుంచి ఏఏఏఐ బోర్డులో ఆయన ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది. ఏఏఏఐ బోర్డు కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీనివాసన్ కే స్వామి సహా బోర్డులో సభ్యులుగా ఉన్న ఇతర ప్రతినిధులతో కలిసి పనిచేసే అవకాశం లభించటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. అడ్వర్‌టైజింగ్ పరిశ్రమను మరింత పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.