Sensex Surges: మార్కెట్‌కు కొనుగోళ్ల మద్దతు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:54 AM
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల ప్రభావం వల్ల గురువారం వరుసగా రెండో రోజు కూడా ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది..
862 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల ప్రభావం వల్ల గురువారం వరుసగా రెండో రోజు కూడా ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. అమెరికన్ ఫెడరల్ కీలక వడ్డీ రేటు తగ్గిస్తుందన్న ఆశలు మార్కెట్లలో కొనుగోళ్ల జోరును పెంచాయి. సెన్సెక్స్ 862.23 పాయింట్ల లాభంతో 83,467.66 వద్ద ముగియగా నిఫ్టీ 261.75 పాయింట్ల లాభంతో 25,585.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1010.05 పాయింట్ల లాభంతో 83,615.48 పాయింట్లను తాకింది. బీఎ్‌సఇ స్మాల్‌క్యాప్ సూచీ 0.47ు, మిడ్‌క్యాప్ సూచీ 0.29ు లాభపడ్డాయి.
ఐపీఓకి డ్యూరోఫ్లెక్స్: మ్యాట్రెసెస్ తయారీ కంపెనీ డ్యూరోఫ్లెక్స్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా తాజాగా రూ.183.6 కోట్ల విలువ గల ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఓఎ్‌ఫ్‌ఎస్ విధానంలో ప్రమోటర్లు 2.25 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయించనున్నారు.