మార్కెట్ లాభాల బాట
ABN , Publish Date - May 22 , 2025 | 05:25 AM
ఈక్విటీ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెర పడింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు బుధవారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. ప్రధానంగా...
సెన్సెక్స్ 410 పాయింట్లు అప్
ముంబై: ఈక్విటీ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెర పడింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు బుధవారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్ ప్రదర్శించడం సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడింది. సెన్సెక్స్ ఒక దశలో 835.2 పాయింట్ల లాభంతో 82,021.64 స్థాయిని తాకింది. కాని ముగింపు సమయానికి లాభాన్ని 410.19 పాయింట్లకు సరిపెట్టుకుని 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129.55 పాయింట్ల లాభంతో 24,813.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 లాభాలతో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ షేరు గరిష్ఠంగా 2.02 శాతం లాభపడగా ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు గరిష్ఠంగా 1.39 శాతం నష్టపోయింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.90 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.51 శాతం లాభపడ్డాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా రంగాల వారీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
వచ్చే వారం మూడు ఐపీఓలు: ప్రైమరీ మార్కెట్లో వచ్చే వారం మూడు ఐపీఓలు సందడి చేయనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వహణ సంస్థ స్ల్కాస్ బెంగళూరు లిమిటెడ్, ఏజీస్ వోప్యాక్ టెర్మినల్స్ ఇష్యూలు వచ్చే సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. స్ల్కాస్ బెంగళూరు లిమిటెడ్ ఇష్యూ ధర శ్రేణిని రూ.413-435గా ప్రకటించింది.
ఏజీస్ వోప్యాక్ టెర్మినల్స్ ఇష్యూ ధర శ్రేణిని రూ.223-235గా ప్రకటించింది. ఇష్యూ ద్వారా రూ.2,800 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
ఇష్యూకి వస్తున్న మరో కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇష్యూ ధర శ్రేణిని రూ.95-105గా ప్రకటించింది. రూ.168 కోట్ల సమీకరణ లక్ష్యంతో కంపెనీ మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇష్యూ వచ్చే మంగళవారం (27వ తేదీ) ప్రారంభమై గురువారం (29వ తేదీ) ముగుస్తుంది.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..