Share News

మళ్లీ నష్టాల్లోకి సూచీలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:31 AM

ఈక్విటీ మార్కెట్లు బుధవారం మళ్లీ తిరోగమనం బాట పట్టాయి. ఆర్‌బీఐ వరుసగా రెండో సారి రెపో రేటు తగ్గించిందన్న ఆనందం స్టాక్‌మార్కెట్‌ను ఏ మాత్రం ఉత్తేజితం చేయలేకపోయింది...

మళ్లీ నష్టాల్లోకి సూచీలు

ముంబై: ఈక్విటీ మార్కెట్లు బుధవారం మళ్లీ తిరోగమనం బాట పట్టాయి. ఆర్‌బీఐ వరుసగా రెండో సారి రెపో రేటు తగ్గించిందన్న ఆనందం స్టాక్‌మార్కెట్‌ను ఏ మాత్రం ఉత్తేజితం చేయలేకపోయింది. అంతకన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల పోటు భయాలే ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఫలితంగా ఒక రోజు విరామం అనంతరం ఈక్విటీ మార్కెట్లు తిరిగి బుధవారం నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇందుకు ఆజ్యం పోశాయి. ఈ ప్రభావంతో ఇంట్రాడేలో 554 పాయిం ట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ చివరికి నష్టాన్ని 379.93 పాయింట్లకు పరిమితం చేసుకుని 73,847.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 136.70 పాయింట్ల నష్టంతో 22,399.15 వద్ద ముగిసింది.

మార్కెట్లకు నేడు సెలవు: మహావీర్‌ జయంతి సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు. స్టాక్‌మార్కెట్‌తో పాటు ఫారెక్స్‌, బులియన్‌ మార్కెట్లన్నీ మూసి ఉంటాయి. శుక్రవారం తిరిగి ట్రేడింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

అమెరికా సహా అతలాకుతలమౌతోన్న ప్రపంచ మార్కెట్లు

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

Updated Date - Apr 10 , 2025 | 03:31 AM