Sensex: స్వల్ప లాభాలతో సరి
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:29 AM
ట్రంప్ సుంకాల అనిశ్చితి ఇంకా వీడకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దాంతో...
సెన్సెక్స్ 64 పాయింట్లు అప్
ముంబై: ట్రంప్ సుంకాల అనిశ్చితి ఇంకా వీడకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దాంతో పరిమిత శ్రేణిలోనే కదలాడిన ప్రామాణిక సూచీలు చివరికి స్వల్ప లాభంతో సరిపెట్టుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ నిలిచేసరికి సెన్సెక్స్ 63.57 పాయింట్ల వృద్ధితో 82,634.48 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 82,784 వద్ద గరిష్ఠాన్ని, 82,342 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. కాగా, నిఫ్టీ 16.25 పాయింట్ల పెరుగుదలతో 25,212.05 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో సగమే రాణించాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..