Stock Market: నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:16 AM
స్టాక్ మార్కెట్‌లో నాలుగు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 153.09 పాయింట్ల నష్టంతో 81,77366 వద్ద ముగియగా నిఫ్టీ...
ముంబై: స్టాక్ మార్కెట్‌లో నాలుగు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 153.09 పాయింట్ల నష్టంతో 81,77366 వద్ద ముగియగా నిఫ్టీ 62.15పాయింట్ల నష్టంతో 25,046.15 వద్ద ముగిశాయి. ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు వంటి బ్లూచిప్ కంపెనీలు, ఆటో, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ అమ్మకాలు బుధవారం సూచీలను కిందికి లాగాయి. క్యూ2లో కంపెనీల ఆర్థిక ఫలితాలపై అనుమానాలు కూడా ఇందుకు దోహదం చేసినట్టు జియోజిత్ ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ కంపెనీ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.