లాభాల స్వీకారంతో మార్కెట్ డౌన్
ABN , Publish Date - May 14 , 2025 | 05:13 AM
భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారంతో సోమవారం రాకెట్‌లా దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ.. మంగళవారం అంతే వేగంతో కిందికి జారా యి. ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడం...
1282 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారంతో సోమవారం రాకెట్‌లా దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ.. మంగళవారం అంతే వేగంతో కిందికి జారా యి. ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడం ఇందుకు కారణం. సెన్సెక్స్ 1,281.68 పాయింట్లు క్షీణించి 81,148.22 వద్దకు పడిపోగా.. నిఫ్టీ 346.35 పాయింట్లు పతనమై 24,578.35 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ మార్కె ట్ క్యాపిటలైజేషన్ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.431.10 లక్షల కోట్లకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 నష్టపోయాయి. బడా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు కొంత మేర కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సూచీ 0.99 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగాయి.
వరుసగా 22 సెషన్లపాటు లోయర్ సర్క్యూట్ స్థాయికి (రోజూ 5 శాతం చొప్పున క్షీణత) పతనమవుతూ వచ్చిన జెన్‌సోల్ ఇంజనీరింగ్ షేరు మంగళవారం 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ స్థాయి రూ.57.28 వద్దకు చేరింది. కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో సెబీ నిషేధం ఎదుర్కొంటున్న జెన్‌సోల్ ప్రమోటర్లు అన్‌మోల్‌సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ కంపెనీ పదవులకు రాజీనామా చేయడంతో షేర్ల వరుస పతనానికి ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది.
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ప్రతిపాదనకు సెబీ ఆమోదం లభించింది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్ల తాజా ఈక్విటీతోపాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 18.9 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది.
పేటీఎంలో 4 శాతం వాటా
విక్రయించిన యాంట్ గ్రూప్
చైనా ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్.. పేటీఎంలో 4 శాతం వాటాను రూ.2,013 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా 4 శాతం వాటాకు సమానమైన 2.55 కోట్లకు పైగా షేర్లను ఉపసంహరించుకుంది. తదనంతరం పేటీఎంలో యాంట్ గ్రూప్ వాటా 9.85ు నుంచి 5.85 శాతానికి తగ్గింది.
బీఓఐలో 8.38 శాతానికి ఎల్‌ఐసీ వాటా
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ వాటా 8.38 శాతానికి పెరిగింది. 2021 సెప్టెంబరు 2 నుంచి 2025 మే 9 మధ్యలో తమ బ్యాంక్‌కు చెందిన 2.026 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసిందని బీఓఐ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు మంగళవారం వెల్లడించింది. దాంతో ఈ నాలుగేళ్లలో బీఓఐలోని ఎల్‌ఐసీ వాటా 6.35 శాతం నుంచి 8.38 శాతానికి చేరుకుంది. బీఎ్‌సఈలో బీఓఐ షేరు 2.27 శాతం పెరిగి రూ.112.55 వద్ద ముగిసింది.
చైనా రక్షణ రంగ షేర్లు ఢమాల్
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో పాక్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా రక్షణ రంగ కంపెనీల షేర్లు 9 శాతం వరకు క్షీణించాయి. దాంతో హాంగ్‌సెంగ్ చైనా ఏ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండెక్స్ 2.9 శాతం పతనమైంది. సూచీలోని ఏవీఐసీ చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ అత్యధికంగా 9.2 శాతం నష్టపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..