Indian Stock Indices Gained: మళ్లీ 26,000 పైకి నిఫ్టీ ఇంట్రాడేలో 85,000 ఎగువకు సెన్సెక్స్
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:47 AM
అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ తీసిన నేపథ్యంలో దేశీయ...
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ తీసిన నేపథ్యంలో దేశీయ సూచీలూ బుధవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒకదశలో 477.67 పాయింట్లు ఎగబాకి 85,105.83 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 368.97 పాయింట్ల లాభంతో 84,997.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.70 పాయింట్లు బలపడి 26,053.90 వద్ద ముగిసింది.
బోట్ రూ.1,500 కోట్ల ఐపీఓ: బోట్ బ్రాండ్‌నేమ్‌తో వేరబుల్ గ్యాడ్జెట్లను విక్రయస్తున్న ఇమాజిన్ మార్కెటింగ్.. ఐపీఓ ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనుంది.