Stock Market: సెన్సెక్స్ మళ్లీ 84,000 ఎగువకు
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:50 AM
ఈక్విటీ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. కొద్ది రోజులుగా భారీ అమ్మకాలు సాగించిన విదేశీ సంస్థలు తిరిగి భారత ఈక్విటీల వైపు దృష్టి...
ముంబై: ఈక్విటీ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. కొద్ది రోజులుగా భారీ అమ్మకాలు సాగించిన విదేశీ సంస్థలు తిరిగి భారత ఈక్విటీల వైపు దృష్టి సారించడంతో పాటు బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు పరుగులు తీయడంతో మార్కెట్లో సెంటిమెంట్ మరింత బలపడింది. దీంతో సెన్సెక్స్ 303.03 పాయింట్లు లాభపడి 84,058.90 వద్ద ముగిసింది. మరోసారి కీలక స్థాయి 84,000 కన్నా పైన స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్లు లాభపడి 25,637.80 వద్ద క్లోజైంది.