Share News

రూ 5 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

ABN , Publish Date - May 21 , 2025 | 02:50 AM

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ మంగళవారం మార్కెట్‌ను కుంగదీసింది. దీంతో సెన్సెక్స్‌ 872.98 పాయింట్లు...

రూ 5 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

సెన్సెక్స్‌ 873 పాయింట్లు డౌన్‌

ముంబై: హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ మంగళవారం మార్కెట్‌ను కుంగదీసింది. దీంతో సెన్సెక్స్‌ 872.98 పాయింట్లు నష్టపోయి 81,186.44 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 నష్టాల్లో క్లోజయ్యాయి. ఆటో, ఫైనాన్షియల్స్‌, రక్షణ రంగాల షేర్లలో కూడా ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి పాల్పడ్డారు. నిఫ్టీ 261.55 పాయింట్ల నష్టంతో 24,683.90 వద్ద ముగిసింది. మార్కెట్‌ నష్టా ల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. మంగళవారం బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.5,64,594.68 కోట్లు దిగజారి రూ.4,38,03,259.51 కోట్ల వద్ద (5.13 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది.

7 ఐపీఓలకు సెబీ ఆమోదం: క్రెడిలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీ లోటస్‌ డెవలపర్స్‌, యూరో ప్రతీక్‌ సహా ఏడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. సెబీ ఆమోదం పొందిన ఇతర కంపెనీల్లో కాలిబర్‌ మైనింగ్‌, జారో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, జెసన్స్‌ ఇండస్ర్టీస్‌, జెమ్‌ ఆరోమేటిక్స్‌ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ రూ.3,000 కోట్లు సమీకరించనున్నాయి.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:50 AM