Share News

Chairman Tuhin Kanta Pandey: షార్ట్‌ సెల్లింగ్‌ను సమీక్షిస్తాం

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:21 AM

ప్రస్తుతం ఉన్న షార్ట్‌ సెల్లింగ్‌, సెక్యూరిటీస్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎస్‌ఎల్‌బీ) విఽధి విధానాలను సమగ్రంగా సమీక్షించాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు...

Chairman Tuhin Kanta Pandey: షార్ట్‌ సెల్లింగ్‌ను సమీక్షిస్తాం

త్వరలోనే వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు .. సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే

నూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న షార్ట్‌ సెల్లింగ్‌, సెక్యూరిటీస్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎస్‌ఎల్‌బీ) విఽధి విధానాలను సమగ్రంగా సమీక్షించాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సీఎన్‌బీసీ టీవీ 18 చానల్‌ నిర్వహించిన ఒక సదస్సులో సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే ఈ విషయం వెల్లడించారు. స్టాక్‌ మార్కెట్లో లిక్విడిటీ పెంచేందుకు తమ డీమ్యాట్‌ ఖాతాల్లో వృధాగా పడి ఉన్న షేర్లను మరొకరికి కొంత ఫీజుకు అద్దెకి ఇచ్చి అదనపు రాబడి పొందేందుకు 2007లో షార్ట్‌ సెల్లింగ్‌ విధానాన్ని, 2008లో ఎస్‌ఎల్‌బీ విధానాన్ని సెబీ ప్రవేశ పెట్టింది. మధ్యలో ఎస్‌ఎల్‌బీ విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా, షార్ట్‌ సెల్లింగ్‌ విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎస్‌ఎల్‌బీ విధానం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. దీంతో ఈ రెండు విధానాలను సమగ్రంగా సమీక్షించాలని సెబీ నిర్ణయించింది.


ఎఫ్‌పీఐ పెట్టుబడులపై బేఫికర్‌

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) తరలిపోవటంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాండే అన్నారు. ఇప్పటికీ మన క్యాపిటల్‌ మార్కెట్లో ఈ సంస్థల పెట్టుబడులు 90,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.79.78 లక్షల కోట్లు) వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్‌పీఐలకు భారత ఆర్థిక వృద్ధిపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం మన స్టాక్‌ మార్కెట్లో దేశీయ సంస్ఘాగత మదుపరులె (డీఐఐ), వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా చురుగ్గా ఉన్నట్టు తెలిపారు. లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లో వ్యక్తిగత మదుపరులు వాటానే 18 శాతం వరకు ఉన్న విషయాన్ని పాండే గుర్తు చేశారు. వీక్లీ ఎక్స్‌పైరీలపై నిషేధం విధించే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 06:21 AM