Share News

ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ చెక్‌ అక్టోబరు నుంచి అమలు

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:13 AM

తన వద్ద నమోదైన సంస్థలకు మదుపరులు చేసే యూపీఐ చెల్లింపులను సెబీ మరింత సురక్షితం చేస్తోంది. ఇక నుంచి ఈ చెల్లింపుల కోసం ‘సెబీ చెక్‌’ అనే ప్రత్యేక...

ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ చెక్‌ అక్టోబరు నుంచి అమలు

ముంబై: తన వద్ద నమోదైన సంస్థలకు మదుపరులు చేసే యూపీఐ చెల్లింపులను సెబీ మరింత సురక్షితం చేస్తోంది. ఇక నుంచి ఈ చెల్లింపుల కోసం ‘సెబీ చెక్‌’ అనే ప్రత్యేక టూల్‌ను తీసుకు రానుంది. దీంతో మదుపరులు తాము చెల్లింపులు చేసే సంస్థ యూపీఐ ఐడీని స్కానింగ్‌, క్యూఆర్‌ కోడ్‌ లేదా ఆ సంస్థ యూపీఐ ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా అది నిజంగా సెబీ వద్ద నమోదైన సంస్థా లేక బోగస్‌ సంస్థా అనే విషయం నిర్ధారిం చుకుని మరీ చెల్లింపులు చేయవచ్చు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచే ఈ చెల్లింపుల విధానం అమలు చేస్తామని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే చెప్పారు.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 04:13 AM