Share News

JioBlackRock: జియోబ్లాక్‌రాక్‌ నుంచి 5 కొత్త ఫండ్స్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:37 AM

కొత్తగా ఐదు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ప్రారంభించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించిందని జియోబ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ బుధవారం వెల్లడించింది...

JioBlackRock: జియోబ్లాక్‌రాక్‌ నుంచి 5 కొత్త ఫండ్స్‌

న్యూఢిల్లీ: కొత్తగా ఐదు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ప్రారంభించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించిందని జియోబ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ బుధవారం వెల్లడించింది. జియోబ్లాక్‌రాక్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌, జియోబ్లాక్‌రాక్‌ నిఫ్టీ 8-13 ఇయర్‌ జీ-సెక్‌ ఇండెక్స్‌ ఫండ్‌, జియోబ్లాక్‌రాక్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌ ఫండ్‌, జియోబ్లాక్‌రాక్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌, జియోబ్లాక్‌రాక్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో నాలుగు ఈక్విటీ ఫండ్లు కాగా.. ఒకటి డెట్‌ ఫండ్‌. ఈ నెల 7న సంస్థ 3 న్యూ ఫండ్‌ ఆఫర్ల (ఎన్‌ఎ్‌ఫఓ) ద్వారా మొత్తం రూ.17,800 కోట్లు సమీకరించింది. ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎ్‌ఫఎ్‌సఎల్‌), అమెరికా చెందిన బ్లాక్‌రాక్‌తో కలిసి సమ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన కంపెనీయే జియోబ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 05:37 AM