ఎస్‌బీఐ మరో ఘనత
ABN , Publish Date - May 14 , 2025 | 05:08 AM
దశాబ్దం క్రితం తన ఐదు అనుబంధ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడం ద్వారా ప్రపంచంలోని 50 అతి పెద్ద బ్యాంక్‌ల జాబితాలోకి ప్రవేశించిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)..
వార్షిక లాభాల పరంగా ప్రపంచ
టాప్-100 జాబితాలోకి ప్రవేశం
న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తన ఐదు అనుబంధ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడం ద్వారా ప్రపంచంలోని 50 అతి పెద్ద బ్యాంక్‌ల జాబితాలోకి ప్రవేశించిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ).. తాజాగా మరో ఘనత సాధించింది. వార్షిక నికర లాభాల పరంగా ప్రపంచంలోని టాప్-100 కంపెనీల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రూ.77,561 కోట్ల (920 కోట్ల డాలర్లు) నికర లాభం ఆర్జించిన ఎస్‌బీఐ.. బ్లూంబర్గ్ రూపొందించిన ఈ జాబితాలో 98వ స్థానంలో నిలిచింది.