Share News

Space Technology: శాట్‌ష్యూర్‌తో ధ్రువ స్పేస్‌ ఒప్పందం

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:22 AM

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న శాట్‌ష్యూర్‌ కంపెనీ అంతరిక్ష టెక్నాలజీ స్టార్టప్‌ అయిన ధ్రువ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

 Space Technology: శాట్‌ష్యూర్‌తో ధ్రువ స్పేస్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న శాట్‌ష్యూర్‌ కంపెనీ అంతరిక్ష టెక్నాలజీ స్టార్టప్‌ అయిన ధ్రువ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉభయ సంస్థలు నానాటికీ విస్తరిస్తున్న అంతరిక్ష అబ్జర్వేషన్‌ సామర్థ్యాలకు మద్దతు ఇచ్చే వన్‌ స్టాప్‌ షాప్‌ను అందుబాటులోకి తెస్తాయి. చిన్న ఉపగ్రహ వ్యవస్థలు, అందుకు అవసరమైన కీలక సహా య వ్యవస్థల ఇంటిగ్రేషన్‌లో ధ్రువ స్పేస్‌కు గల నైపుణ్యాలను శాట్‌ష్యూర్‌ అనుబంధ సంస్థ కలైడియో అనలిటికల్‌ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేసే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుంది.

Updated Date - Jul 01 , 2025 | 02:23 AM