Reliance Consumer Products: రిలయన్స్ కన్స్యూమర్ గూటికి తమిళనాడు కంపెనీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:17 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్‌ఎంసీజీ అనుబంధ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్)...
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్‌ఎంసీజీ అనుబంధ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) మరో కంపెనీని కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఉదయమ్ ఆగ్రో ఫుడ్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు ఆర్‌సీపీఎల్ ప్రకటించింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ రూ.650 కోట్ల పై స్థాయిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఉదయమ్ ఆగ్రో.. బియ్యం, పప్పులు, మసాలాలు, చిరుతిళ్లు, ఇడ్లీ పిండి సహా పలు ఆహారోత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ డీల్ ద్వారా ఆర్‌సీపీఎల్.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐడీ ఫ్రెష్, ఎంటీఆర్ బ్రాండ్ ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది.