Share News

World Bank India Economy: సంస్క రన్‌ తోనే సాధ్యం

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:25 AM

వచ్చే 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఆర్థిక సేవల రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టడంతోపాటు ప్రైవేట్‌ రంగంలో మూలధన నిధుల సమీకరణకు ఊతమివ్వాలని...

World Bank India Economy: సంస్క రన్‌ తోనే సాధ్యం

  • 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే ఆర్థిక సేవల రంగంలో మరిన్ని సంస్కరణలు అవసరం

  • ప్రైవేట్‌ రంగంలో మూలధన సమీకరణకు ఊతమివ్వాలి..

  • భారత్‌కు ప్రపంచ బ్యాంక్‌ సూచన

న్యూఢిల్లీ: వచ్చే 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఆర్థిక సేవల రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టడంతోపాటు ప్రైవేట్‌ రంగంలో మూలధన నిధుల సమీకరణకు ఊతమివ్వాలని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక భారత్‌కు సూచించింది. భారత్‌ ప్రపంచ స్థాయి డిజిటల్‌ ప్రజా మౌలిక వసతులను కలిగి ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలు దేశంలోని పురుషులు, మహిళలకు విస్తృతమైన ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చాయని వరల్డ్‌ బ్యాంక్‌ ‘ఫైనాన్షియల్‌ సెక్టార్‌ అసె్‌సమెంట్‌ (ఎ్‌ఫఎ్‌సఏ)’ రిపోర్టు పేర్కొంది. ఖాతాల వినియోగాన్ని, ముఖ్యంగా మహిళల్లో మరింత పెంచాల్సిన అవసరం ఉందని.. వ్యక్తులు, ఎంఎ్‌సఎంఈలకు ఆర్థిక సాధనాలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలని నివేదిక సూచించింది. మరిన్ని విషయాలు..

  • బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎ్‌ఫసీ) నియంత్రణ, పర్యవేక్షణపైనా రిపోర్టులో ప్రస్తావించింది. సహకార బ్యాంకులపై నియంత్రణాధికారాల విస్తరణ, కీలక నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు నియంత్రణ, పర్యవేక్షణ శాఖ పునర్‌వ్యవస్థీకరణ ఆర్థిక సేవల రంగ దక్షతను మరింత పెంచనుంది. అలాగే, ఎన్‌బీఎ్‌ఫసీలకు స్కేల్‌ బేస్డ్‌ నియమావళిని సైతం ప్రపంచ బ్యాంక్‌ స్వాగతించింది. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలపై మరింత మెరుగైన పర్యవేక్షణ కోసం క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ నియమావళిని మరింత బలోపేతం చేయాలని సూచించింది.

  • గడిచిన ఐదేళ్లలో భారత క్యాపిటల్‌ మార్కెట్‌ (ఈక్విటీ, ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు) జీడీపీలో 144 శాతం నుంచి 175 శాతానికి పెరిగింది. క్యాపిటల్‌ మార్కెట్లో విస్తృత మౌలిక వసతులు, భారీగా పెరిగిన మదుపరులు వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. మూలధన సమీకరణకు మరింత దోహదపడేలా రుణ విస్తరణ వ్యవస్థ అభివృద్ధి, రిస్క్‌ షేరింగ్‌ ఫెసిలిటీస్‌, సెక్యూరిటైజేషన్‌ వేదికను అభివృద్ధి చేయాలని వరల్డ్‌ బ్యాంక్‌ నివేదిక సూచించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 06:25 AM