Gold Reserves: ఆర్‌బీఐ వద్ద 880 టన్నుల పసిడి
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:44 AM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్‌బీఐ) కూడా పసిడి నిల్వలు పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం...
విలువ రూ.8.36 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్‌బీఐ) కూడా పసిడి నిల్వలు పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 880.18 టన్నులకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటి కి ఉన్న నిల్వలతో పోలిస్తే ఇది 600 కిలోలు ఎక్కువ. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఇది 9,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.36 లక్షల కోట్లు) సమానం. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బీఐ 54.13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఫారెక్స్ నిల్వల నిర్వహణలో భాగంగా ఇతర కేంద్ర బ్యాంకుల్లానే ఆర్‌బీఐ కూడా పసిడి నిల్వలు పెంచుకుంటోంది. గత ఏడాది కాలంలో ఆర్‌బీఐతో పాటు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు 166 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి.