Share News

RBI Pravah Portal: లైసెన్సులు, దరఖాస్తులకు ఆర్‌బీఐ ప్రవాహ్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:14 AM

ఆర్‌బీఐ ప్రవాహ్‌ పోర్టల్‌ వేదికగా మాత్రమే ఇకపై లైసెన్సులు, అనుమతులు, ఆధారైజేషన్లకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది

RBI Pravah Portal: లైసెన్సులు, దరఖాస్తులకు ఆర్‌బీఐ ప్రవాహ్‌

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి లైసెన్సులు, అనుమతులు, ఆధరైజేషన్లు పొందాలనుకుంటున్న సంస్థలు.. దరఖాస్తుల సమర్పణకు ప్రవాహ్‌ పోర్టల్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. మే 1 నుంచి ప్రవాహ్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తన నియంత్రణలోని సంస్థలు సహా అన్నింటినీ ఆర్‌బీఐ ఆదేశించింది. నియంత్రణాపరమైన అనుమతుల ప్రక్రియ అంతటినీ సంపూర్ణంగా డిజిటలైజ్‌ చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఆర్‌బీఐ ప్రవాహ్‌ వేదికను గత ఏడాది మే 28న ప్రారంభించింది.

Updated Date - Apr 12 , 2025 | 03:16 AM