RBI Governor Sanjay Malhotra: రెపో కోత ప్రయోజనం కస్టమర్లకు అందించండి
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:36 AM
దేశంలో వృద్ధికి ఉత్తేజం కల్పించడం కోసం రెపోరేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులకు సూచించారు...
బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్
ముంబై: దేశంలో వృద్ధికి ఉత్తేజం కల్పించడం కోసం రెపోరేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పలు విడతల్లో రెపోరేటును ఆర్‌బీఐ 1.25ు మేరకు తగ్గించింది. దాంతో ప్రస్తుతం రెపోరేటు 5.25 శాతానికి దిగి వచ్చింది. ఈ ఏడాది దేశంలో బ్యాంకింగ్ రంగ స్వస్థత, కార్యకలాపాలు నిలకడగా మెరుగయ్యాయని అన్నారు. అయినప్పటికీ అవి నిర్లక్ష్య వైఖరి వీడి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. రెపో కోతతో పాటు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా మధ్యంతర వ్యయాలను తగ్గించి సామర్థ్యాలు పెంచుకోవడం, సుస్థిర వృద్ధికి మద్దతు ఇవ్వడం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బ్యాంకులు కస్టమర్ సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలంటూ ఫిర్యాదులను తగ్గించి అంతర్గత వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవడంపై దృష్టి సారించాలని మల్హోత్రా సూచించారు.