RBI interest rates: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:24 AM
వడ్డీ రేట్లు మరింత తగ్గించడంపై తొందర లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు...
ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు మరింత తగ్గించడంపై తొందర లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గడంతో ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ సమావేశంలోనూ రెపో రేటు మరో పావు శాతం తగ్గిస్తుందని అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మల్హోత్రా వడ్డీ రేట్ల కోతలపై తొందరపడటం లేదని చెప్పడం విశేషం. ధరల స్థిరత్వంతో పాటు జీడీపీ వృద్ధి రేటు కూడా తమకు అత్యంత ముఖ్యమని మల్హోత్రా చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు కంటే ద్రవ్యోల్బణ కట్టడే ఆర్‌బీఐ ముఖ్య కర్తవ్యమని చెప్పడం సరికాదన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..