Share News

IPO: ఐపీఓకు రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ దరఖాస్తు

ABN , Publish Date - May 11 , 2025 | 04:57 AM

పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించడానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సివిల్ కన్‌స్ట్రక్షన్ సేవల సంస్థ రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది.

IPO: ఐపీఓకు రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ దరఖాస్తు

ముంబయి: పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించడానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సివిల్ కన్‌స్ట్రక్షన్ సేవల సంస్థ రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఒక్కో షేరు రూ.10 ముఖ విలువతో కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా దాదాపు రూ. 1,100 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఇష్యూలో ప్రస్తుతం ఉన్న షేర్ల విక్రయం (ఓఎఫ్ఎస్) ఉండదు. సేకరించిన నిధులను కొత్త యంత్రాలు కొనడానికి, అనుబంధ సంస్థల రుణాల చెల్లింపునకు వాటిలో పెట్టుబడి పెట్టడానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.


2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 3,092 కోట్లు. ఈ సంస్థ ప్రభుత్వ రంగ క్లయింట్ల కోసం రోడ్లు, హైవేలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, టన్నెల్స్ వంటి వాటి నిర్మాణ సేవలు అందిస్తోంది. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇరవై ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డీఅండ్‌బీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆర్డర్ బుక్, లాభాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈపీసీ సంస్థల్లో ఇది ఒకటి. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ఈ ఇష్యూకి ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నాయి.

Updated Date - May 11 , 2025 | 04:57 AM