Share News

Raghuram Rajan Urges: అమెరికాతో వాణిజ్య చర్చల్లో జర జాగ్రత్త

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:58 AM

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం అమెరికాతో జరుపుతున్న చర్చల్లో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌...

Raghuram Rajan Urges: అమెరికాతో వాణిజ్య చర్చల్లో జర జాగ్రత్త

  • టారి్‌ఫలు 20ు మించకూడదు

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

న్యూయార్క్‌: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం అమెరికాతో జరుపుతున్న చర్చల్లో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. ఈయూ, జపాన్‌ దేశాల్లా తొందరపడి అమెరికాకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దని కోరారు. అలాగే ఈ ఒప్పందం ద్వారా అమెరికా మన ఎగుమతులపై విధించే సుంకాలు 10 నుంచి 20 శాతం మించకుండా చూసుకోవాలని కోరారు. లేకపోతే తూర్పు, దక్షిణాసియా దేశాల ఉత్పత్తులతో మన ఉత్పత్తులు పోటీపడడం కష్టమని రాజన్‌ స్పష్టం చేశారు. ఈయూ, జపాన్‌ దేశాలు అమెరికాలో భారీ గా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చి 15 శాతం సుం కాలతో బయటపడ్డాయన్నారు. మన దేశం అలాంటి హామీలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. మన దేశం జీరో సుంకాలకు అమెరికాను ఒప్పిస్తే మరీ మంచిదన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 02:58 AM