Share News

UPI Integration: ఆగస్టు నుంచి పోస్టాఫీసుల్లో డిజిటల్‌ చెల్లింపులు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:02 AM

శవ్యాప్తంగా పోస్టాఫీసులన్నీ ఆగస్టు నెల నుంచి డిజిటల్‌ చెల్లింపులను ఆమోదించనున్నాయి. యూపీఐ సిస్టమ్‌తో తమ ఖాతాలను అనుసంధానం చేయకపోవడం వల్ల...

 UPI Integration: ఆగస్టు నుంచి పోస్టాఫీసుల్లో డిజిటల్‌ చెల్లింపులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోస్టాఫీసులన్నీ ఆగస్టు నెల నుంచి డిజిటల్‌ చెల్లింపులను ఆమోదించనున్నాయి. యూపీఐ సిస్టమ్‌తో తమ ఖాతాలను అనుసంధానం చేయకపోవడం వల్ల ఇన్నాళ్లూ పోస్టాఫీసులు డిజిటల్‌ చెల్లింపులను అనుమతించలేకపోయాయి. ఐటీ సిస్టమ్‌లో కొత్త అప్లికేషన్‌ చేర్చడంతో ఇది సాధ్యమైంది. దీనివల్ల కస్టమర్లు డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లింపులు చేసే వెసులుబాటు ఏర్పడింది.

Updated Date - Jun 28 , 2025 | 04:04 AM