Pension Funds Allowed by PFRDA: ఈక్విటీల్లోకి పెన్షన్ ఫండ్స్
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:09 AM
పెన్షన్ ఫండ్స్ (పీఎఫ్) పెట్టుబడుల విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ పెన్షన్ ఫండ్స్.. ఈక్విటీ షేర్లలో పెట్లుబడులు పెట్టేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ...
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్స్ (పీఎఫ్) పెట్టుబడుల విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ పెన్షన్ ఫండ్స్.. ఈక్విటీ షేర్లలో పెట్లుబడులు పెట్టేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) ఆమోదం తెలిపింది. అయితే ఈ పెట్టుబడులు తమ మొత్తం నిధుల్లో 25 శాతం మించకూడదని స్పష్టం చేసింది. అది కూడా నిఫ్టీ 250 జాబితాలోని కంపెనీల షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈక్విటీ షేర్లతో పాటు గోల్డ్, సిల్వర్ ఈటీఎ్‌ఫలు సెబీ నియంత్రణలోని ఇన్విట్స్, రీట్స్, ఆల్టర్నేటివ్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్స్ (క్యాటగిరి-1, క్యాటగిరి-2)లో మదుపు చేసేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెన్షన్ ఫండ్స్‌లో మదుపు చేసే ఇన్వెస్టర్లకు మరింత మెరుగైన రాబడులు అందించేందుకు ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు.
నామినేషన్ ప్రక్రియ వాయిదా
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాలకు నామినీల ప్రక్రియ మూడో దశను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వాయి దా వేసింది. నిజానికి ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే తమ సిస్టమ్స్ అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం కావాలని మ్యూచువల్ ఫండ్స్, డిపాజిటరీలు, డీమ్యాట్ కంపెనీలు చెప్పడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ మళ్లీ చేపట్టాలో త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..