Share News

కేజీ బేసిన్‌ క్లస్టర్‌ 2పై ఓఎన్‌జీసీ కసరత్తు

ABN , Publish Date - May 22 , 2025 | 05:19 AM

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని క్లస్టర్‌-2 ప్రాజెక్టు (కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2) ఉత్పత్తి పెంపుపై ఓఎన్‌జీసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం తమతో భాగస్వామ్య పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ...

కేజీ బేసిన్‌ క్లస్టర్‌ 2పై ఓఎన్‌జీసీ కసరత్తు

ఎక్సాన్‌, బీపీ, షెల్‌ కంపెనీలతో చర్చలు

న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని క్లస్టర్‌-2 ప్రాజెక్టు (కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2) ఉత్పత్తి పెంపుపై ఓఎన్‌జీసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం తమతో భాగస్వామ్య పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ చమురు దిగ్గజ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్సాన్‌ మొబిల్‌, బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ), షెల్‌ కంపెనీలతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ విషయంలో ఎక్సాన్‌తో జరుగుతున్న చర్చలు ఆశాజనకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే: ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని లోతట్టు సముద్ర జలాల్లో ఉన్న ఈ బ్లాకులో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి కోసం ఓఎన్‌జీసీ దాదాపు 500 కోట్ల డాలర్లు (సుమారు రూ.42,500 కోట్లు) ఖర్చు చేసింది. ఈ బ్లాకు నుంచి రోజూ 45,000 బ్యారళ్ల చమురు, 10 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎ్‌ససీఎండీ) గ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చని ముందు అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఈ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో అంతర్జాతీయ చమురు దిగ్గజాల అధునాతన టెక్నాలజీ, అనుభవాన్ని ఉపయోగించుకుని ఉత్పత్తి పెంచాలని ఓఎన్‌జీసీ యోచిస్తోంది.

ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 05:19 AM