Oloktra GreenTech Product: ఒలెక్ట్రా నుంచి జీఎఫ్ఆర్‌పీ రీబార్స్
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:19 AM
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ అభివృద్ధి చేసిన జీఎఫ్‌ఆర్‌పీ రీబార్స్ స్టీల్ కంటే రెండు రెట్లు ధృడంగా, నాలుగు రెట్లు తేలికగా ఉంటాయి.ఈ బార్స్ తుప్పు పట్టకుండా, విద్యుత్ ప్రసారం చేయకుండా, తడి వాతావరణాల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచేలా రూపొందించబడ్డాయి.
స్టీల్ కంటే రెండింతల ధృడత్వం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ లిమిటెడ్ మరో వినూత్న ఉత్పత్తిని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగానికి అవసరమైన జీఎఫ్‌ఆర్‌పీ రీబార్స్‌ను (గ్లాస్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ పాలిమర్ రీబార్) అభివృద్ధి చేసింది. సంప్రదాయ స్టీల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌తో పోలిస్తే ఈ బార్స్ రెండింతల ధృడత్వం, నాలుగింతలు తేలికగా ఉంటాయని తెలిపింది. ఎంఈఐఎల్ బడ్జెట్ మీట్ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి ఈ బార్స్‌ను విడుదల చేశారు. ఈసీఆర్ గ్లాస్, ఇపోక్సి రెజిన్‌లతో ఈ జీఎ్‌ఫఆర్‌పీ రీబార్స్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తుప్పుపట్టక పోవడం, విద్యుత్ ప్రసరించకపోవడం, అయస్కాంత ప్రభావానికి లోనుకాక పోవడం, నీటిలో తడిచినా పాడుకాకపోవడం ఈ బార్స్ ప్రత్యేకతలు.