Share News

Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్‌ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ బైక్‌ ప్రారంభ ధర రూ.84,999

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:28 AM

ఓలా ఎలక్ట్రిక్‌ తమ తొలి రోడ్‌స్టర్‌ ఎక్స్‌ మోటార్‌ సైకిల్‌ను తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్‌ నుంచి విడుదల చేసింది. ఈ బైక్‌ దేశంలో ఎలక్ట్రిక్‌ వాహన విప్లవానికి కీలకంగా నిలవనుంది

 Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్‌ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ బైక్‌ ప్రారంభ ధర రూ.84,999

న్యూఢిల్లీ: విద్యుత్‌ టూ వీలర్ల దిగ్గజం ఓలా ఎలక్ర్టిక్‌ తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్‌ నుంచి తొలి రోడ్‌స్టర్‌ ఎక్స్‌ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ దేశంలో విద్యుత్‌ వాహనాల విప్లవాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని కంపెనీ చైర్మన్‌, ఎండీ భవిష్‌ అగర్వాల్‌ అన్నారు. ఈ బైక్‌ విక్రయాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సీరిస్‌ సర్వీసింగ్‌కు అనుకూలమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ (బీఎంఎస్‌) కలిగి ఉంటుంది. మూడు వేరియెంట్లలో అందుబాటులో ఉండే ఈ బైక్‌ ధరలు వరుసగా రూ.84,999, రూ.94,999,రూ.1,04,999గా ఉన్నాయి. ఇవి కాకుండా టాప్‌ వేరియెంట్‌ రోడ్‌స్టర్‌ ఎక్స్‌+4.5 కిలోవాట్ల బ్యాటరీతో కూడిన బైక్‌ ధర రూ.1,14,999గా ఉండగా రోడ్‌స్టర్‌ ఎక్స్‌+9.1 కిలోవాట్ల బ్యాటరీ (4680 భారత్‌ సెల్‌)తో కూడిన ధర రూ.1,84,999గా ఉంది.

Updated Date - Apr 12 , 2025 | 03:28 AM