Office Space Leasing: ఆఫీస్ స్పేస్ లీజింగ్ 6శాతం అప్
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:58 AM
ఈ ఏడాది హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజింగ్ వార్షిక ప్రాతిపదికన 6ు పెరిగి 7.15 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని...
న్యూఢిల్లీ: ఈ ఏడాది హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజింగ్ వార్షిక ప్రాతిపదికన 6ు పెరిగి 7.15 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ కోలియర్ వెల్లడించింది. దేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల నుంచి కార్యాలయ స్థలానికి గిరాకీ గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాదీ ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కన్పించనుందని, టెక్నాలజీ, బీఎ్‌ఫఎ్‌సఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాల వృద్ధి ఇందుకు చోదకంగా పనిచేయవచ్చని అంటోంది. నగరాలవారీగా చూస్తే, ఈ ఏడాది ముంబై, హైదరాబాద్‌లో మాత్రం ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ తగ్గిందని.. మిగతా ఐదు నగరాల్లో (చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సీఆర్) పెరిగిందని ఆ రిపోర్టులో ప్రస్తావించింది.