త్వరలోనే ఎన్ఎస్ఈ ఐపీఓ
ABN , Publish Date - May 23 , 2025 | 04:28 AM
ఎన్ఎస్ఈ ఐపీఓకు త్వరలోనే మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే చెప్పారు. అయితే ఎప్పటిలోగా సెబీ నుంచి ఇందుకు అనుమతి లభిస్తుందనే...
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ ఐపీఓకు త్వరలోనే మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే చెప్పారు. అయితే ఎప్పటిలోగా సెబీ నుంచి ఇందుకు అనుమతి లభిస్తుందనే విషయాన్ని చెప్పేందుకు నిరాకరించారు. ఢిల్లీలో అసోచాం నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన ఆయన విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ ఐపీఓకు నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు తాము లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్‌ఎ్‌సఈతో చర్చిస్తున్నామన్నారు. సెబీ అభ్యంతరాలతో ఎన్‌ఎన్‌సీ ఐపీఓ గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉంది.
13 కోట్లు దాటిన మార్కెట్ ఇన్వెస్టర్లు
దేశాభివృద్ధికి క్యాపిటల్ మార్కెట్ ప్రస్తుతం ఇంధనంలా మారిందని సెబీ చీఫ్ అన్నారు. దేశంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే మదుపరుల సంఖ్య ప్రస్తుతం 13 కోట్లు దాటిపోయిందన్నారు. 2019 మార్చితో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువన్నారు. 1996-2010 మధ్య పుట్టిన ప్రతి ముగ్గురు జనరేషన్-జెడ్ యువతలో ఒకరు ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్ల డించారు. ఇండ్‌సఇండ్ బ్యాంకు ఉన్నతోద్యోగుల భారీ అక్రమాలపై తాము కూడా దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..